తెలంగాణ రాష్ట్ర డీజీపీగా అంజనీ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ ను డీజీపీ అంజనీ కుమార్ ప్రగతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తనకు డీజీపీగా అవకాశం కల్పించినందుకు అంజనీ కుమార్ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 1992లో జనగామ ఏఎస్పీగా మొదలైన అంజనీ కుమార్ అంచెలంచెలుగా ఎదిగి డీజీపీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత 3వ డీజీపీగా నియమితులయ్యారు. పదవీ స్వీకరణ కార్యక్రమంలో సీపీలు సీవీ ఆనంద్, మహేశ్ భగవత్‌తో పాటు పలువురు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.