ఉద్యోగుల డీఏ బకాయిలపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉద్యోగుల డీఏ (DA) బకాయిలపై కీలక వివరణ ఇచ్చారు.

By -  Knakam Karthik
Published on : 23 March 2026 3:38 PM IST

Telangana, Bhatti Vikramarka, Telangana Assembly, DA Arrears, Telangana Employees, Congress Government

ఉద్యోగుల డీఏ బకాయిలపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉద్యోగుల డీఏ (DA) బకాయిలపై కీలక వివరణ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూడు డీఏ బకాయిలను పెండింగ్‌లో పెట్టిందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిలను క్లియర్ చేశామని ఆయన తెలిపారు.

గతంలోనే సరైన నిర్ణయాలు తీసుకుని ఉంటే ప్రస్తుతం ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యేవి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యోగులకు సంబంధించిన మిగిలిన పెండింగ్ బిల్లులను కూడా వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని భట్టి విక్రమార్క సభలో హామీ ఇచ్చారు.

Next Story