దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఇలా చేయలేదు: డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ.22,500 కోట్ల భారీ బడ్జెట్‌తో 4.50 ఇందిరమ్మ లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది..అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

By Knakam Karthik
Published on : 6 July 2025 6:33 PM IST

Telangana, Khammam District, Deputy Chief Minister Bhatti Vikramarka, Congress Government

దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఇలా చేయలేదు: డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ.22,500 కోట్ల భారీ బడ్జెట్‌తో 4.50 ఇందిరమ్మ లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది..అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆదివారం తన సొంత నియోజకవర్గమైన ఖమ్మం జిల్లా మధిరలో పర్యటించిన ఆయన, అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఒకేసారి ఇన్ని గృహాలు కేటాయించలేదని ఆయన పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదల కోసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆయన విమర్శించారు. తాము రైతు భరోసా కోసం రూ.17,500 కోట్లు చెల్లించామని గుర్తుచేశారు.

ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ, రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పారు. నిరుద్యోగుల కోసం రూ.8 వేల కోట్లతో 'రాజీవ్ యువ వికాసం' పథకాన్ని, డ్వాక్రా మహిళలకు రూ.లక్ష కోట్లతో రుణ సౌకర్యం కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని భట్టి విక్రమార్క వెల్లడించారు. అనంతరం, మధిర పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.6.45 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అంబారుపేట పెద్ద చెరువు ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంతో పట్టణానికి కొత్త శోభ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story