తెలంగాణలోనూ ఏవై 4.2 కరోనా వేరియంట్.!

Delta variant ay.4. 2 in telangana. దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోన్న కరోనా డెల్టా ఏవై.4.2.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అలజడి సృష్టిస్తోంది.

By అంజి  Published on  28 Oct 2021 9:37 AM GMT
తెలంగాణలోనూ ఏవై 4.2 కరోనా వేరియంట్.!

దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోన్న కరోనా డెల్టా ఏవై.4.2.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అలజడి సృష్టిస్తోంది. తెలంగాణలో ఏవై.4.2 వేరియంట్‌ కేసులు నమోదయ్యాయని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ క్లారిటీ ఇచ్చింది. ఒక వ్యక్తికి మాత్రమే ఏవై.4.2 డెల్టా వేరియంట్‌ సోకిందని.. అది కూడా జూన్‌ నెలలో సోకిందని తెలిపింది. జూన్‌ నెల నుంచి ఇప్పటి వరకు ఏ.వై.4.2 డెల్టా వేరియంట్‌ కేసులు నమోదు కాలేదని తెలిపింది.

కర్ణాటక రాష్ట్రంలో ఏవై.4.2 డెల్టా వేరియంట్‌ కేసులు ఏడు నమోదు అయ్యాయి. బెంగళూరు నగరంలో మూడు కేసులు, ఇతర ప్రాంతాల్లో నాలుగు కేసులు నమోదు అయ్యాయి. ఈ కొత్త వేరియంట్‌ కలకలంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు 18 ఏవై.4.2 వేరియంట్‌ కేసులు నమోదు కాగా.. ఇందులో ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్రలోనే ఉన్నాయి. తెలంగాణలో ఒక కేసు మాత్రమే నమోదైందని, ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసిజ్ కంట్రోల్‌ తెలిపింది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 26 వేలకుపైగా ఏవై.4.2 వేరియంట్‌ కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌వో తన తాజా రిపోర్ట్‌లో తెలిపింది. డెల్టా వేరియంట్‌లో మూడు వర్గాలుగా 67 రకాల స్ట్రెయిన్లు ఉన్నాయి. అందులో ఏవై.4.2 వేరియంట్‌ ఒకటి.

Next Story
Share it