ఢిల్లీ మద్యం స్కామ్‌: వ్యాపారవేత్త వెన్నమనేని ఇళ్లపై ఈడీ దాడులు

Delhi liquor scam: ED raids on businessman Venmaneni's houses. హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం సుమారు ఏడు గంటల పాటు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Sep 2022 4:01 AM GMT
ఢిల్లీ మద్యం స్కామ్‌: వ్యాపారవేత్త వెన్నమనేని ఇళ్లపై ఈడీ దాడులు

హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం సుమారు ఏడు గంటల పాటు ప్రముఖ వ్యాపారవేత్త వెన్నమనేని శ్రీనివాసరావుపై ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని వెన్నమనేని నివాసం, కార్యాలయం, రామంతపూర్, మాదాపూర్‌లోని ఐటీ కంపెనీలపై దాడులు నిర్వహించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో 14వ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లై నివాసాలు, రాబిన్‌ డిస్టిలరీస్‌ డైరెక్టర్‌లుగా ఉన్న బోయినిపల్లి అభిషేక్‌రావు, గండ్ర ప్రేంసాగర్‌రావు, ఆడిటర్‌ బుచ్చిబాబు ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ దాడుల్లో లభించిన ఆధారాలతో వెన్నమనేనిపై ఈడీ దృష్టి సారించింది.

వెన్నమనేని శ్రీనివాసరావుకు పలు వ్యాపారాలు ఉండడంతో పాటు కరీంనగర్‌లో గ్రానైట్ వ్యాపారం, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఇసుక క్వారీల్లో పెట్టుబడులు పెట్టాడు. అంతేకాకుండా హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారి అయిన ఆయన రాష్ట్రంలోని పలువురు రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. అలాగే రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ ప్రేంసాగర్ గండ్రకు శ్రీనివాసరావు బావమరిది. అందువల్ల, దిగువ స్థాయి నుండి ఢిల్లీ మద్యం కాంట్రాక్టులకు భారీ మొత్తంలో నగదు చెల్లించినట్లు ఈడీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. మద్యం కేసు తుది దశకు చేరుకుందని తెలిసింది. ఈడీ అధికారులు త్వరలో పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

Next Story