ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ పొడిగింపు

ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ నేత కవితకు ఊరట లభించలేదు.

By Medi Samrat  Published on  23 March 2024 8:49 AM GMT
ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ నేత కవితకు ఊరట లభించలేదు. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ రిమాండ్‌ను మార్చి 26 వరకు పొడిగించింది. ఇదిలావుంటే.. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత మీడియాతో మాట్లాడుతూ.. 'ఇది అక్రమ అరెస్టు. దీనిపై కోర్టులో పోరాడతాం. ఇది రాజకీయ కల్పిత కేసు, తప్పుడు కేసు. దానిపై పోరాడుతున్నాం. ఇందులో కొత్తేమీ లేదని.. మళ్లీ మళ్లీ అవే అడుగుతున్నారని అన్నారు.

46 ఏళ్ల కవితను హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ఇంటి నుండి ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కె కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం ఈడీకి నోటీసులు జారీ చేసింది. ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ప్రత్యేక బెంచ్ క‌విత అభ్యర్థనను వినడానికి నిరాకరించింది.

Next Story