సామాజిక బాధ్యతగా అక్కడ పని చేయండి..ప్రైవేట్ డాక్టర్లకు సీఎం రేవంత్ రిక్వెస్ట్

హైదరాబాద్‌ను హెల్త్ టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

By Knakam Karthik
Published on : 2 July 2025 1:32 PM IST

Hyderabad, Cm Revanthreddy, AIGHospitals, Government Hospitals,

సామాజిక బాధ్యతగా అక్కడ పని చేయండి..ప్రైవేట్ డాక్టర్లకు సీఎం రేవంత్ రిక్వెస్ట్

హైదరాబాద్‌ను హెల్త్ టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి బంజారాహిల్స్‌లో ఏఐజీ ఆసుపత్రిని (AIG Hospital) ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..నగర ప్రజలకు రెండో అతిపెద్ద హాస్పిటల్ ను అందుబాటులోకి తెచ్చినందుకు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారిని అభినందిస్తున్నా. నాగేశ్వర్ రెడ్డి హైదరాబాద్, తెలంగాణకు గొప్ప పేరు తీసుకొచ్చారు. ఆయన సేవలను గుర్తించి కేంద్రప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ ఇచ్చింది. ఆయన భారతరత్నకు అర్హులు. ఆయనకు భారతరత్న వచ్చేలా తెలంగాణ నుంచి నా వంతు ప్రయత్నం చేస్తా. 66 దేశాల నుంచి పేషంట్స్ కు AIG ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కు వస్తున్నారు.. ఇది గర్వకారణం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నాం. అందులో హెల్త్ టూరిజం ఒక చాప్టర్ గా ఉంటుంది. అందులో భాగంగానే డాక్టర్ నోరి దత్తత్యేయుడిని క్యాన్సర్ కేర్ సలహాదారుడిగా నియమించాం. తెలంగాణ రాష్ట్రం చేపట్టే ప్రణాళికలో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని కూడా భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నా..అని సీఎం వ్యాఖ్యానించారు.

విద్య, వైద్యానికి మా ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్య ఇస్తోంది. ప్రభుత్వ హాస్పిటల్స్‌పై పేదలకున్న అభిప్రాయం మారేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సామాజికి బాధ్యతగా ఏడాదిలో ఒక్క నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ డాక్టర్లను కోరుతున్నా. మీకు ఇష్టం వచ్చిన ఆసుపత్రిని ఎంచుకుని నెలరోజుల పాటు పని చేయాలి. నిమ్స్, ఉస్మానియాలో పని చేస్తే చాలా అనుభవం వస్తుందని చెప్పారు. నిమ్స్ లో అదనపు బ్లాక్, ఎల్ బీ నగర్, సనత్ నగర్ లో ఆసుపత్రులు నిర్మిస్తున్నాం, త్వరలో అందుబాటులోకి 25 ఆసుపత్రులు రాబోతున్నాయి..అని సీఎం పేర్కొన్నారు.

Next Story