ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.. ఎన్నికల్లో గెలిచాడు..!

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో సంగారెడ్డిలో సర్పంచ్ పదవికి పోటీ చేసిన అభ్యర్థి మరణానంతరం విజయం సాధించాడు.

By -  Medi Samrat
Published on : 15 Dec 2025 6:30 PM IST

ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.. ఎన్నికల్లో గెలిచాడు..!

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో సంగారెడ్డిలో సర్పంచ్ పదవికి పోటీ చేసిన అభ్యర్థి మరణానంతరం విజయం సాధించాడు. రాయికోడ్ మండలంలోని పిప్పడ్‌పల్లి గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ చేసిన 36 ఏళ్ల చాల్కి రాజు అనే అభ్యర్థి డిసెంబర్ 7న కాంగ్రెస్ నాయకులు, మద్దతుదారులు మోసం చేశారని ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు.

పిప్పడ్‌పల్లి గ్రామానికి చెందిన చాల్కి రాజు కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. రాజకీయాల్లో జరిగిన పరిణామాలతో తీవ్ర మనస్థాపానికి గురై ఈ నెల 6న అత్మహత్య చేసుకొని మృతి చెందాడు. ఎన్నికల బరిలో ఉన్నట్టుగానే అధికారులు ప్రకటించారు. పిప్పడ్‌ పల్లి సర్పంచ్‌ అభ్యర్తులుగా చాల్కి రాజు, నారాయణ, నాట్కరి రాజు ఎన్నికల బరిలో నిలిచారు. గ్రామంలో 1735 ఓట్లు ఉండగా 1463 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీటిలో చాల్కి రాజుకు 699, నారాయణకు 690, నాట్కరి రాజుకు 74 ఓట్లు వచ్చాయి. చాల్కి రాజు సమీప ప్రత్యర్థి బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుదారుడైన నారాయణపై 9 ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. తన భర్తను గెలిపించిన గ్రామ ప్రజలందరికీ అతని భార్య శ్వేత ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు.

Next Story