అందరికీ ఆదర్శం.. అంగన్‌వాడీలో జిల్లా కలెక్టర్‌ కూమార్తెలు..!

Daughters of a Collector studying in Anganwadi. కుమ్రంభీం జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తన ఇద్దరు కుమార్తెలు నిర్వికరాజ్‌, రిత్వికరాజ్‌లను చదువుకునే వయసు

By అంజి  Published on  20 Nov 2021 4:28 AM GMT
అందరికీ ఆదర్శం.. అంగన్‌వాడీలో జిల్లా కలెక్టర్‌ కూమార్తెలు..!

కుమ్రంభీం జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తన ఇద్దరు కుమార్తెలు నిర్వికరాజ్‌, రిత్వికరాజ్‌లను చదువుకునే వయసు రావడంతో అంగన్‌వాడీ కేంద్రానికి పంపిస్తున్నారు. జన్కాపూర్‌-1 అంగన్‌వాడీ కేంద్రంలో ఇద్దరు చిన్నారులు తన తొటి పిల్లలతో ఆడుతూ పాడుతూ సంతోషంగా గడుపుతున్నారు. కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ పిల్లలు మూడు నెలలుగా అంగన్‌వాడీకి వస్తున్నారు. చిన్నారులిద్దరూ అంగన్‌వాడీ కేంద్రంలో ఓనమాలు దిద్దుతున్నారు. వారు రోజు ఇక్కడే తాము వంట చేసిన భోజనమే చేస్తున్నారని టీచర్‌ అరుణ తెలిపారు.

పై ఫోటోలో ముందు వరుసలో కూర్చున్న కలెక్టర్‌ పిల్లలు.. టీచర్‌ ఎదో చెబుతుంటే ఆసక్తిగా వింటున్నారు. ఈ కాలంలో కొంత ఆర్థిక పరిస్థితి బాగుంటేనే పెద్ద పెద్ద కార్పొరేట్‌ ప్లేస్కూల్స్‌కు పంపుతున్నారు. ఇలాంటి రోజుల్లో కలెక్టర్‌ తన పిల్లలు ప్రభుత్వం నిర్వహించే అంగన్‌వాడీ కేంద్రానికి పంపి పిల్లల తల్లిదండ్రులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించడం ద్వారా మరింత మెరుగుపడతాయని పలువురు అంటున్నారు. కలెక్టర్ రాహుల్‌ రాజ్‌ను శభాష్‌ సార్‌ అంటూ మెచ్చుకుంటున్నారు.

Next Story