మంత్రి అవినీతి నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాం
Dasoju Sravan Fires On Minister Mallareddy. మల్లారెడ్డి నీకు దమ్ముంటే నీ అవినీతిపై విచారణకు సిద్ధం కావాలి అంటూ సవాల్
By Medi Samrat Published on 26 Aug 2021 3:40 PM GMT
మల్లారెడ్డి నీకు దమ్ముంటే నీ అవినీతిపై విచారణకు సిద్ధం కావాలి అంటూ సవాల్ విసిరారు టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. అనుచిత వ్యాఖ్యలతో తప్పించుకోవాలని చూస్తున్నావు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నీ అవినీతిపైన ప్రాథమిక ఆధారాలతో మాట్లాడారని శ్రవణ్ అన్నారు. ఆసుపత్రి, మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీ భూములపైన అవినీతి ఆరోపణలు చేస్తున్నాం.. రుజువు చేయాలని మీరూ డిమాండ్ చేస్తున్నారు కదా.. విచారణకు ఆదేశించమని సీఎం కేసీఆర్ ను అడగండి.. మీ అవినీతిని నిరూపించకపోతే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటామని మంత్రికి సవాల్ విసిరారు.
రేవంత్ రెడ్డిని రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్న మంత్రి మల్లారెడ్డి.. మీ అవినీతిపై విచారణ జరిపి.. అవినీతి లేదని తేలితే ఎంపీ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారని అన్నారు. మీకు రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఉంటే.. అక్కడ మీకు పోటీ చేయాలని ఉంటే.. మీ అవినీతి పైన విచారణ జరిపి నిజాయితీ నిరూపించుకోవాలని అన్నారు. తిట్ల పురాణం చేయాలని.. తిట్ల రాజకీయాలను చేయాలని చూస్తే మీకంటే.. మాకు ఎక్కువ తిట్లు వచ్చని దాసోజు శ్రవణ్ అన్నారు.