కాంగ్రెస్‌ను వీడే యోచ‌న‌లో దాసోజు శ్ర‌వ‌ణ్‌.. బుజ్జగింపుకు బ‌య‌ల్దేరిన నేత‌లు

Dasoju Shravan is planning to leave the Congress. తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు మ‌రో షాక్ త‌గిలింది. ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దాసోజు శ్రవణ్

By Medi Samrat  Published on  5 Aug 2022 3:48 PM IST
కాంగ్రెస్‌ను వీడే యోచ‌న‌లో దాసోజు శ్ర‌వ‌ణ్‌.. బుజ్జగింపుకు బ‌య‌ల్దేరిన నేత‌లు

తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు మ‌రో షాక్ త‌గిలింది. ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దాసోజు శ్రవణ్ పార్టీని వీడుతున్న‌ట్లు తెలుస్తోంది. పీజేఆర్ కూతురు, ఖైర‌తాబాద్ కార్పోరేట‌ర్ విజ‌యా రెడ్డి ఇటీవ‌ల కాంగ్రెస్‌లో చేరిన విష‌యం తెలిసిందే. ఆ నియోజ‌క‌వ‌ర్గానికే ప్రాతినిద్యం వ‌హిస్తున్న దాసోజు శ్రవణ్ ఆమె చేరిక ప‌ట్ల అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఎపిసోడ్ తో కాంగ్రెస్ మైలేజ్ త‌గ్గిన‌ట్లుగా క‌న‌ప‌డుతుండ‌గా.. దాసోజు శ్రవణ్ కూడా పార్టీని వీడుతుండ‌టంతో శ్రేణుల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది. రేవంత్ దూకుడు నిర్ణ‌యాలే ఈ చ‌ర్య‌ల‌కు కార‌ణ‌మ‌ని వ్య‌తిరేక వ‌ర్గం అంటుండ‌గా.. స్వ‌లాభం కోస‌మే పార్టీని వీడుతున్నారంటూ మ‌ద్ద‌తు దారులు అంటున్నారు.

ఇదిలావుంటే.. దాసోజు శ్రవణ్ ను కలిసి చర్చించేందుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, కిసాన్ కాంగ్రెస్ నేత కోదండ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకుడు అనిల్ యాదవ్ బంజారాహిల్స్ లోని ఆయన కార్యాలయానికి బయలుదేరారు. కొద్దిసేపట్లో దాసోజు శ్రవణ్‌ ను కలిసి కాంగ్రెస్ పార్టీ లో కొనసాగాల‌ని బుజ్జగించనున్నారు కాంగ్రెస్ నేతలు.


Next Story