విద్యార్థుల‌కు పండ‌గే.. తెలంగాణ‌లో 15 రోజుల పాటు 'ద‌స‌రా' సెల‌వులు

Dasara holidays from September 26 to October 9 in Telangana.తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Sep 2022 6:24 AM GMT
విద్యార్థుల‌కు పండ‌గే.. తెలంగాణ‌లో 15 రోజుల పాటు ద‌స‌రా సెల‌వులు

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల‌కు శుభ‌వార్త‌. పాఠ‌శాల‌లకు ఈ నెల 26 నుంచి వ‌చ్చే నెల 8వ తేదీ వ‌ర‌కు ప్ర‌భుత్వం ద‌స‌రా సెల‌వులు ప్ర‌క‌టించింది. ఈ నెల 25, అక్టోబ‌ర్ 9న ఆదివారాలు కావ‌డంతో మొత్తం 15 రోజుల పాటు సెల‌వులు కొన‌సాగ‌నున్నాయి. అక్టోబ‌ర్ 10న తిరిగి పాఠ‌శాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు అన్ని జిల్లాల విద్యాధికారుల‌కు స‌ర్య్కూల‌ర్‌ను పంపించింది. కాగా.. అక్టోబ‌ర్ 5న ద‌స‌రా పండుగ జ‌ర‌గ‌నుంది.

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సెలవులు ఇవే.

  • సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 వరకు దసరా సెలవులు (15 రోజులు).
  • క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు కొనసాగనున్నాయి.
  • జనవరి 13 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు.
  • వేసవి సెలవులు ఏప్రిల్ 25 2023 నుంచి జూన్ 11,2023 వరకు.

Next Story
Share it