Rain Alert : హైదరాబాద్‌ను క‌మ్మేసిన చీకటి మేఘాలు

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) సూచనల నేప‌థ్యంలో హైదరాబాద్‌ను చీకటి మేఘాలు కమ్మేశాయి.

By Kalasani Durgapraveen  Published on  15 Oct 2024 6:00 AM GMT
Rain Alert : హైదరాబాద్‌ను క‌మ్మేసిన చీకటి మేఘాలు

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) సూచనల నేప‌థ్యంలో హైదరాబాద్‌ను చీకటి మేఘాలు కమ్మేశాయి. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురుస్తుంది. హైదరాబాద్‌లో శుక్రవారం వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మంగళ, బుధ‌, గురు, శుక్రవారాల్లో ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసిన‌ వాతావరణ శాఖ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

ఇదిలావుంటే.. రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జె.భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, భువనగిరి మినహా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నిన్న హైదరాబాద్‌లో కూడా అక్కడక్కడా వర్షాలు కురిశాయి. అత్యధికంగా షేక్‌పేటలో 8.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Next Story