తెలంగాణ : బీజేపీలో చేర‌నున్న మ‌రో కాంగ్రెస్ కీల‌క నేత‌

Damodar Reddy resigns from congress. తెలంగాణ రాష్ట్రంలో పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీని వీడుతూ ఉన్నారు.

By Medi Samrat  Published on  22 Aug 2022 4:45 PM IST
తెలంగాణ : బీజేపీలో చేర‌నున్న మ‌రో కాంగ్రెస్ కీల‌క నేత‌

తెలంగాణ రాష్ట్రంలో పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీని వీడుతూ ఉన్నారు. తాజాగా టీపీసీసీ లీగల్‌ సెల్‌ చైర్మన్‌ దామోదర్‌రెడ్డి సైతం పార్టీని వీడారు. కాంగ్రెస్‌ పార్టీలో ఎంత కష్టపడినా ఫలితం ఉండడం లేదని, తమ కష్టాన్ని పార్టీ నేతలు గుర్తించడం లేదని చెబుతూ కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు దామోదర్‌రెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక లాపాలకు పాల్పడుతున్న దామోదర్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ మరో ప్రకటనలో వెల్లడించారు.

ఇటీవలే దాసోజ్ శ్రవణ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి.. కాషాయ కండువా కప్పుకున్నారు. టీఆర్ఎస్‌ కు రాజీనామా చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు కూడా బీజేపీలో చేరబోతున్నారు. రాబోయే రోజుల్లో మరి కొందరు వ్యక్తులు బీజేపీలో చేరబోతున్నారనే సంకేతాలు మాత్రం బలంగా వినిపిస్తూ ఉన్నాయి.


Next Story