మొంథా తుఫాను తో తెలంగాణ లో 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం, తీవ్రమైన తుఫాను "మోంత" మరియు దాని కారణంగా 12 జిల్లాల్లోని 179 రెవెన్యూ మండలాల్లో సంభవించిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 4,47,864 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి, దీని వలన 2.53 లక్షల మంది రైతులు తీవ్ర నష్టపోయే ప్రమాదం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన ప్రాథమిక నష్ట అంచనా నివేదిక ద్వారా ఇది వెల్లడైంది.  
ఇది ప్రాధమిక అంచనా మాత్రమే అని, పూర్తి స్థాయిలో సర్వే కి ఆదేశినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. నివేదిక వరి 2,82,379 ఎకరాల్లో పత్తి 1,51,707 ఎకరాల్లో నష్టం జరిగినట్టు అధికారులు తయారు చేసిన నివేదిక వెల్లడించింది. పంట నష్టం ఎక్కువగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,30,200 ఎకరాల్లో చోటు చేసుకుంది, తరువాత స్థానంలో ఖమ్మం జిల్లా 62,400 ఎకరాల్లో, నల్గొండ జిల్లాలో 52,071 ఎకరాల్లో పంట నష్టం చేసుకుంది.