HCU: రోహిత్ వేముల ఆత్మహత్య కేసు క్లోజ్.. సరైన ఆధారాలు లేవని..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల మృతి కేసును సైబరాబాద్ పోలీసులు క్లోజ్ చేశారు.
By అంజి Published on 3 May 2024 5:41 PM ISTHCU: రోహిత్ వేముల ఆతహత్య కేసు క్లోజ్.. సరైన ఆధారాలు లేవని..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల మృతి కేసును సైబరాబాద్ పోలీసులు క్లోజ్ చేశారు. ఆధారాలు లేకపోవడంతో కేసును మూసివేసినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. తుది నివేదికను కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసు నుంచి హెచ్‌సీయూ మాజీ వైస్‌ఛాన్స్‌లర్ అప్పారావును తప్పించారు. రోహిత్ ఎస్సీ కాదని హైకోర్టుకు రిపోర్ట్ సమర్పించారు. తనది ఫేక్ ఎస్సీ సర్టిఫికెట్ అని తేలితే సాధించిన డిగ్రీలు కోల్పోవడంతో పాటు శిక్ష పడుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ఆయన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని తెలిపిన పోలీసులు.. నిందితులందరికీ క్లీన్‌చిట్ ఇచ్చారు.
జనవరి 17, 2016న రోహిత్ వేముల తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. 2016లో రోహిత్ వేముల మరణం భారత విద్యారంగంలోని ఉపాంత వర్గాలకు చెందిన విద్యార్థులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త నిరసనకు దారితీసింది. దీనిని "సంస్థాగత హత్య"గా పేర్కొంటూ, బహుజన సంఘాలు యూనివర్సిటీ పరిపాలనపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగ (ఎస్సీ/ఎస్టీ) అట్రాసిటీల నిరోధక చట్టం కేసు నమోదైంది. ఈ ఘటన హెచ్‌సీయూలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో కలకలం రేపింది. కాగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే క్లోజర్ రిపోర్ట్ రావడం గమనార్హం.