బెట్టింగ్ యాప్స్ ప్రమోట్, యూట్యూబర్ హర్షసాయికి బిగ్ షాక్

ప్రముఖ యూట్యూబర్‌ హర్షసాయిపై కూడా కేసు నమోదైంది.

By Knakam Karthik  Published on  16 March 2025 6:49 PM IST
Hyderabad News, Youtuber Harsha Sai, Betting Apps, Sajjanar, Cyberabad Police

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్, యూట్యూబర్ హర్షసాయికి బిగ్ షాక్

బెట్టింగ్‌ యాప్స్ వల్ల డబ్బులు పోగొట్టుకొని ఎందరో యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో యువత జీవితాలను నాశనం చేసే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని నిబంధనలకు విరుద్ధంగా ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ పై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు యూట్యూబర్‌లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తాజాగా ప్రముఖ యూట్యూబర్‌ హర్షసాయిపై కూడా కేసు నమోదైంది. బెట్టింగ్‌ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న హర్షసాయిపై సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘నేను ఎవరిపైనా వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదు. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తోన్న పబ్బం గడుపుకొంటోన్న సోషల్ మీడియా ఇన్‌ ఫ్లూయెన్సర్లతో మాత్రమే పోరాడుతున్నాను. వారు తమను అనుసరిస్తోన్న లక్షలాది మందిని తప్పుదారి పట్టిస్తున్నారు. అమాయాకుల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇది మనకు ఆర్థికంగా ఎంతో నష్టం కలిగిస్తుంది. దేశ భవిష్యత్ ను అగమ్య గోచరం చేసతుంది. ప్రస్తుతం ప్రపంచంలోని ఎన్నో ప్రముఖ సంస్థలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారు. అదే సమయంలో చాలా మంది యువకులు తమ జీవితాలు ఇలాంటి ఇన్ ఫ్లూయెన్సర్ల చేతిలో పెడుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ వ్యక్తిగతంగానే కాకుండా సామాజిక, ఆర్థిక భద్రతకు ముప్పుగా పరిణమించాయి. ఇప్పటికే ఎంతో మంది జీవితాలను విఛ్చిన్నం చేశాయి. ఆలస్యం కాకముందే అందరూ మేల్కొండి. బెట్టింగ్ యాప్స్ తో కలిగే నష్టాన్ని గుర్తించండి – ఇది మీ వ్యక్తిగత జీవితానికి, మీ భవిష్యత్తుకు, మీ కుటుంబ శ్రేయస్సుకు, అలాగే మన సమాజ నిర్మాణనికి తోడ్పడుతుంది’ అని సజ్జనార్ రాసుకొచ్చారు.

Next Story