తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం.. సైబర్‌ నేరాలను అరికట్టేందుకు కొత్త విధానం

Cyber Crime Unit For All Police Stations. తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతీ పోలీసుస్టేషన్‌నే సైబర్‌ క్రైమ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

By Medi Samrat  Published on  23 Feb 2021 8:46 AM GMT
Cyber Crime Unit For All Police Stations

రోజురోజుకు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతోంది. అయితే టెక్నాలజీ మంచి కోసం కాకుండా చెడు కోసం కూడా వినియోగించేవారు కూడా ఎక్కువైపోతున్నారు. మంచిదానికే కాకుండా చెడు కోసం టెక్నాలజీని ఉపయోగించి దుర్వినియోగం చేస్తున్నారు. దీంతో సైబర్‌ క్రైమ్‌లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీని కారణంగా ఎందరో బలవుతున్నారు.

సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఈ సైబర్‌ నేరాలను ఎంత కట్టడి చేద్దామనుకున్నా.. ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతీ పోలీసుస్టేషన్‌నే సైబర్‌ క్రైమ్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక ప్రతీ పోలీసు స్టేషన్‌లో సైబర్‌ క్రైమ్‌ నిపుణులు ఉంటారని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు.

సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టేందుకు దేశంలోనే తొలిసారిగా సైబర్‌ వారియర్లను తయారు చేస్తోంది. ప్రతి పోలీసు స్టేషన్‌లోనూ సైబర్‌ యోధులను నియమించుకున్నారు. వారికి ట్రైనింగ్‌ ఇచ్చి తద్వారా వారిని సైబర్‌ యోధులుగా తీర్చిదిద్ది సైబర్‌ నేరాలను అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సైబర్‌ క్రైమ్‌ కేసులపై టెక్నాలజీ సహాయంతో విచారణ జరపడం, ప్రజల్లో అవగాహన కలిగించం లాంటివి చేయనున్నారు. సైబర్‌ నేరాలను కట్టడి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్‌లలో ప్రత్యేకంగా సైబర్‌ వారియర్‌ యూనిట్లను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ మహేందర్‌ తెలిపారు.


Next Story
Share it