వర్షాల నష్టాల అంచనాలు ఎప్పటికప్పుడు సమర్పించాలి: సీఎస్

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులను సమీక్షించారు.

By Knakam Karthik
Published on : 21 March 2025 9:46 PM IST

Telangana, Rains, Weather, Cm Revanth, CS Shanthikumari, District Collectors

వర్షాల నష్టాల అంచనాలు ఎప్పటికప్పుడు సమర్పించాలి: సీఎస్

ఉమ్మడి ఆదిలాబాద్ , కరీంనగర్ జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అక్కడ పరిస్థితిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులను సమీక్షించారు. రానున్న 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు.

వడగళ్ళ వాన వలన నెలకొన్న పరిస్థితులను ఆమె అడిగి తెలుసుకున్నారు. జిల్లా యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన సహాయక చర్యలు అందించాలన్నారు. రానున్న 48 గంటలలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని సూచన ఉన్నందున అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సి.ఎస్ ఆదేశించారు.

జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. అకాల వర్షాల వలన ఏర్పడే నష్టాల అంచనాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు అందించాలన్నారు.

Next Story