ములుగు ఫారెస్టులో బీరు బాటిల్ ఐఈడీ.. నిర్వీర్యం చేసిన సీఆర్పీఎఫ్

CRPF defused beer bottle bombs of Maoists in Mulugu district. ములుగు జిల్లాలోని పామునూరు గ్రామ సమీపంలోని రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఫిబ్రవరి 17న

By అంజి  Published on  21 Feb 2023 8:45 AM GMT
ములుగు ఫారెస్టులో బీరు బాటిల్ ఐఈడీ.. నిర్వీర్యం చేసిన సీఆర్పీఎఫ్

ములుగు జిల్లాలోని పామునూరు గ్రామ సమీపంలోని రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఫిబ్రవరి 17న వెంకటాపురం పోలీసులు బీరు బాటిల్‌తో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)ని కనుగొన్నట్లు ఏటూరునాగారం అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ సిరిశెట్టి సంకీర్త్ ప్రెస్ నోట్‌లో తెలిపారు. పోలీసులను హతమార్చేందుకు మావోయిస్టులు ఐఈడీని అమర్చారని ఏఎస్పీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణలోకి ప్రవేశించినట్లు నిఘావర్గాలు అందడంతో పోలీసు బలగాలు అటవీ ప్రాంతంలోకి వెళ్తున్నాయి. పామునూరు అటవీ ప్రాంతానికి పోలీసులు వస్తారని తెలుసుకున్న మావోయిస్టు నేతలు బీరు బాటిళ్లలో బాంబులు అమర్చి మందుపాతర అమర్చారు..

''వెంకటాపురం సిఐ కె శివప్రసాద్, ఎస్‌ఐ తిరుపతి, స్పెషల్ పార్టీ సిబ్బంది, సిఆర్‌పిఎఫ్ 39 (ఎఫ్) బెటాలియన్ అధికారులు, బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ టీమ్ పామునూరు గ్రామం పశ్చిమ రిజర్వ్‌కు వెళ్లారు. అడవిలో కూంబింగ్ చేస్తున్నప్పుడు, రహదారిపై విద్యుత్ తీగ కనుగొనబడింది, ఇది బృందం పామునూరు గ్రామం పశ్చిమ దిశకు దారితీసింది. అక్కడ ఒక బీర్ బాటిల్ ఐఈడీ కనుగొనబడింది. బాంబు డిస్పోజబుల్‌ బృందం బాంబును డిఫ్యూజ్ చేసింది'' అని చెపపారు. బీర్ బాటిల్ మౌత్ పీస్ అటాచ్ చేసిన రెండు మీటర్ల ఎలక్ట్రిక్ వైర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సీపీఐ మావోయిస్టు నేతలు పుల్లూరి ప్రసాదరావు, బడే చొక్కారావు, కొయ్యడ సాంబయ్య, కంకణాల రాజిరెడ్డితోపాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story