ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నేరస్తునికి ఉరిశిక్ష.. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ను అభినందించిన డీజీపీ

అత్యాచారం, హత్య, పోక్సో కేసులో నేరస్తునికి ఉరిశిక్ష పడిన కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డిని తెలంగాణ రాష్ట్ర డిజిపి డాక్టర్ జితేందర్ అభినందించి కమాండేషన్ సర్టిఫికెట్ అందజేశారు.

By Medi Samrat
Published on : 22 May 2025 5:44 PM IST

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నేరస్తునికి ఉరిశిక్ష.. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ను అభినందించిన డీజీపీ

అత్యాచారం, హత్య, పోక్సో కేసులో నేరస్తునికి ఉరిశిక్ష పడిన కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డిని తెలంగాణ రాష్ట్ర డిజిపి డాక్టర్ జితేందర్ అభినందించి కమాండేషన్ సర్టిఫికెట్ అందజేశారు. నేరస్థుడు బీహార్‌కు చెందిన గఫర్ అలీ(56) కాగా.. కేసు వివరాళ్లోకెళితే.. అదిత్రీ కన్స్ట్రక్షన్‌లో కూలి పని చేస్తున్న శంకర్ మనమరాలు(5)పై గఫర్ అలీ అత్యాచారం చేసి హత్య చేశాడని ఫిర్యాదు అందింది. బీడీఎల్ బానూర్ పోలీసులు కేసు నమోదు చేయగా.. అప్పటి పటాన్ చెరువు డీఎస్పీ పురుషోత్తం రెడ్డి కేసు పరిశోధన ప్రారంభించి పరిశోధనలో భాగంగా నేరస్తుని అరెస్టు చేసి కేసులో కీలక ఆధారాలు సేకరించి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ వేశారు. సంగారెడ్డి సెషన్స్ కోర్టులో విచారణ కొనసాగింది. నేరస్తునిపై నేరం రుజువైనందున కోర్టు మరణశిక్ష విధించింది.

ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసిన అప్పటి పటాన్ చెరువు డిఎస్పి, గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి, పారదర్శకంగా నూతన సాంకేతికతను ఉపయోగించి కేసు ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తునికి మరణశిక్ష పడే విధంగా కేసు పరిశోధన చేసినందుకు తెలంగాణ రాష్ట్ర డిజిపి డాక్టర్ జితేందర్ ఈరోజు డీజీపీ ఆఫీసులో పురుషోత్తం రెడ్డిని అభినందించి కమాండేషన్ సర్టిఫికెట్ అందజేశారు.

Next Story