డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మహ్మద్ సిరాజ్

క్రికెటర్ మహ్మద్ సిరాజ్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.

By Medi Samrat  Published on  11 Oct 2024 5:20 PM IST
డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మహ్మద్ సిరాజ్

క్రికెటర్ మహ్మద్ సిరాజ్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం తెలంగాణ డీజీపీకి రిపోర్టు చేసిన తర్వాత క్రికెటర్ ఎండీ సీరాజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారి(డీఎస్పీ)గా బాధ్యతలు స్వీకరించారు. సిరాజ్‌కు గ్రూప్-1 ప్రభుత్వ ఉద్యోగాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. మహ్మద్ సిరాజ్ ఈరోజు భాధ్య‌త‌లు స్వీక‌రించ‌డంతో ముఖ్యమంత్రి హామీ నెరవేరిన‌ట్లైంది.

సిరాజ్ 1994 మార్చి 13న తెలంగాణలోని హైదరాబాద్‌లో హైదరాబాదీ ముస్లిం కుటుంబంలో జన్మించాడు. సిరాజ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దేశీయ క్రికెట్‌లో హైదరాబాద్‌కు ఆడతాడు. సిరాజ్ 2023 ఆసియా కప్‌ను గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. సిరాజ్ 2024 T20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో కూడా సభ్యుడు .

Next Story