Rangareddy: విద్యుత్ తీగలకు తగిలిన క్రాకర్స్ లారీ..తప్పిన ప్రాణనష్టం (video)

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ పరిధిలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది

By -  Knakam Karthik
Published on : 21 March 2026 5:18 PM IST

Telangana, RangaReddy, Fire Accident, Fire Crackers, Short Circuit

Rangareddy: విద్యుత్ తీగలకు తగిలిన క్రాకర్స్ లారీ..తప్పిన ప్రాణనష్టం (video) 

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ పరిధిలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. క్రాకర్స్ లోడ్‌తో వెళ్తున్న ఒక లారీ ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలకు తగిలి ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. లారీ పైన వేలాడుతున్న విద్యుత్ వైర్లను గమనించకుండా డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనివ్వడంతో, ఆ తీగలు లారీలోని బాణసంచాకు తగిలి ఘర్షణ జరగడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటన గ్రామ సమీపంలోనే జరగడంతో పెంజర్ల గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

లారీలోని బాణసంచా పెద్ద ఎత్తున పేలుతూ మంటలు ఆకాశమంత ఎత్తున ఎగసిపడటాన్ని చూసి ప్రాణభయంతో ప్రజలు అటు ఇటు పరుగులు తీశారు. భారీ శబ్దాలతో బాణసంచా పేలడం వల్ల ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాయి. అదృష్టవశాత్తూ ఈ భారీ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేవలం డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని, జనసంచారం తక్కువగా ఉన్న సమయంలో ఈ ఘటన జరగడంతో పెద్ద ముప్పు తప్పిందని స్థానికులు చెబుతున్నారు.

Next Story