ఎదురు కాల్పులు అన్ని ప్రభుత్వ హత్యలే : ఎమ్మెల్యే కూనంనేని హాట్ కామెంట్స్

ప్రశ్నించే వాళ్లకు బ్రతికే స్వేచ్ఛ లేదా..? అమిత్ షా 2026 నాటికీ నక్సలిజాన్ని లేకుండా చేస్తాం అంటే అర్థం ఏంటి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబ‌శివ‌రావు ప్ర‌శ్నించారు.

By Medi Samrat  Published on  3 Dec 2024 2:15 PM IST
ఎదురు కాల్పులు అన్ని ప్రభుత్వ హత్యలే : ఎమ్మెల్యే కూనంనేని హాట్ కామెంట్స్

ప్రశ్నించే వాళ్లకు బ్రతికే స్వేచ్ఛ లేదా..? అమిత్ షా 2026 నాటికీ నక్సలిజాన్ని లేకుండా చేస్తాం అంటే అర్థం ఏంటి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబ‌శివ‌రావు ప్ర‌శ్నించారు. మగ్ధుమ్ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఎదురు కాల్పులు అన్ని ప్రభుత్వ హత్యలేన‌న్నారు. మొన్న జరిగిన ఎన్‌కౌంట‌ర్‌ను సుమోటోగా స్వీకరించి జ్యూడీషియల్ ఎంక్వైరీ చెయ్యాలి.. మానవ హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.

మోదీ, అమిత్ షా చేసే తప్పుల‌కు మిమ్మల్ని ఏమి చెయ్యాలి..? పోలీసులు ఎన్కౌంటర్ తెలంగాణ ప్రభుత్వానికి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అని ప్ర‌శ్నించారు. ఛత్తీస్‌ఘ‌డ్‌, తెలంగాణ బార్డర్ లో జరిగిన ఎన్‌కౌంట‌ర్ లో తెలంగాణ పోలీసులు ఎందుకు పాల్గొన్నారు.. ప్రభుత్వం బాధ్యత వహించి సమాధానం చెప్పాలన్నారు.

10 ఏళ్లుగా బీజేపీ దేశానికి చేసింది ఏంటి.. ప్రభుత్వ ఆస్తులు అమ్ముకోవడం తప్ప.. బీఆర్ఎస్ వారు పదేళ్ల‌ కాలం పాటు మీరు చేసిన వాగ్దానాలు అన్ని నెర‌వేర్చారా..? బీఆర్ఎస్‌కు రుణమాఫీ గురించి అడిగే హక్కు లేదన్నారు.

ప్రభుత్వం పోతుందని నాలుగున్నర ఏళ్ల తరువాత చివరలో మీరు చేసింది 2వ దఫాలో రూ.11,000 వేల కోట్లు మాత్రమే.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ద‌ఫాలోనే రూ.20,000 కోట్లు రుణమాఫీ చేశారు.. బీఆర్ఎస్‌ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వల్లనే అసలు హక్కు దారులకు ఇంకా కొంతమేర రుణమాఫీ అందలేదన్నారు.

అలాగే ధరణిలో ఉన్న తప్పులను సరిచేయండని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. మధ్యాహ్నా బోజన వర్కర్స్ జీతాలు పెండింగ్ బిల్లులు చెల్లించండని కోరారు. ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీవేజ్, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ జీతాలు.. సింగరేణి, ఇతర కాంట్రాక్టు కార్మికుల శ్రమకు తగిన వేతనాలు.. రేషన్ కార్డులు, ఫించన్లు ప్రక్రియ వేగవంతం చేయండని కోరారు.

Next Story