నా వర్జినాలిటీ మీకు తెలియ‌దు.. నా జోలికి రాకండి : సీపీఐ ఎమ్మెల్యే వార్నింగ్‌

తెలంగాణలో జరిగిన అతిపెద్ద కుంభకోణం ధరణి.. భూములు తిరిగి పట్టేదారులకు వెళ్తుంది అని సీ

By Medi Samrat  Published on  27 July 2024 6:19 PM IST
నా వర్జినాలిటీ మీకు తెలియ‌దు.. నా జోలికి రాకండి : సీపీఐ ఎమ్మెల్యే వార్నింగ్‌

తెలంగాణలో జరిగిన అతిపెద్ద కుంభకోణం ధరణి.. భూములు తిరిగి పట్టేదారులకు వెళ్తుంది అని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అసెంబ్లీలో ఆయ‌న మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ధరణి సరి చేస్తున్నాం అంటున్నారు.. ఎక్కడ సరి చేశారు అనేది తెలియడం లేదన్నారు. దళిత, గిరిజనులకు నిధులు బాగానే కేటాయించారు. వికలాంగులను అవమానించే విధంగా ఒక ఐఏఎస్ వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీలకు సంరక్షణ మాదిరి వారికి ఒక చట్టం తేవాలన్నారు. విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వాలి.. క్వాలిటీతో ఇవ్వాలన్నారు.

ప్రతి జిల్లాలో విద్య, వైద్య రంగానికి ఒక్కో ఐఏఎస్ అధికారిణి నియమించాలన్నారు. ఇరిగేషన్ అంటే ఏటీఎంగా మారిందన్నారు. ధరణి మాదిరి అతి పెద్ద కుంభకోణం కాళేశ్వరం.. నీటి లభ్యత లేదు అన్న సాకుతో రిడిజైన్ చేశారన్నారు. సాధించుకుంది ఈ తెలంగాణ చూడడానికి కాదు.. పేదవాడి కళ్ళలో ఆనందం చూడాల‌న్నారు. జర్నలిస్టులకు ప్రత్యేక పాలసీ తేవాలన్నారు.

నేను మాట్లాడుతున్నప్పుడు హరీష్ రావుకు ఇబ్బంది అవుతుంది. హరీష్ రావు నా వర్జినాలిటీ ఇంకా మీకు తెలియదు. నేను ఇంకా అన్ని విషయాలు మాట్లాడితే బాగుండదు.. నా జోలికి రాకండి అని అన్నారు.

Next Story