ఇకపై NIA ఎస్పీగా ఖమ్మం పోలీసు కమిషనర్..!

ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ సెంట్రల్ సర్వీసులో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు.

By Medi Samrat
Published on : 30 Dec 2023 11:15 AM IST

ఇకపై NIA ఎస్పీగా ఖమ్మం పోలీసు కమిషనర్..!

ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ సెంట్రల్ సర్వీసులో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఎస్పీగా.. ఖమ్మం సీపీ విష్ణు వారియర్ నియమిస్తూ కేంద్ర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో విధుల నుంచి రిలీవ్ చేయాలని CS శాంతకుమారికి కేంద్రం లేఖ రాసింది. దీంతో విష్ణు వారియర్ ఐదేళ్ల పాటు డిప్యూటేషన్‌పై ఎస్పీ హోదాలో కొనసాగనున్నారు. 2013 తెలంగాణ క్యాడర్ కు చెందిన ఆయన మొదట నిర్మల్ ఎస్పీగా, గత మూడేళ్లుగా ఖమ్మం సీపీగా పనిచేస్తున్నారు.

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కి పోస్టింగ్ ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్‌ను రిలీవ్ చేసింది. వారియర్‌ను ఐదేళ్లపాటు ఎన్‌ఐఏకు డిప్యూటేషన్‌పై తీసుకుంటున్నట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శి ఎ శాంతికుమారికి ఇటీవల రాసిన లేఖలో పేర్కొంది. వారియర్ 2013 తెలంగాణ కేడర్ IPS అధికారి. 2021 ఏప్రిల్‌లో ఖమ్మం పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు.

Next Story