సోషల్ మీడియా మత్తులో భవిష్యత్తును నాశనం చేసుకోకండి
ద్విచక్ర వాహనంపై లవర్స్ స్టంట్ చేస్తూ స్కిడ్ అయి పడిపోయిన వీడియోను
By Medi Samrat Published on 19 Aug 2023 8:52 PM ISTద్విచక్ర వాహనంపై లవర్స్ స్టంట్ చేస్తూ స్కిడ్ అయి పడిపోయిన వీడియోను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. 'యువతీ యువకులారా! సోషల్ మీడియా మత్తులో పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకండి. లైక్లు, కామెంట్ల కోసం ప్రమాదకర స్టంట్స్ అసలే చేయకండి. ఇలాంటి పిచ్చి పనులు చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యుల గురించి ఒకసారి ఆలోచించండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులను మనో వేదనకు గురిచేయకండి' అని సూచించారు.
యువతీయువకులారా...! సోషల్ మీడియా మత్తులో పడి బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకోకండి. లైక్ లు, కామెంట్ల కోసం ప్రమాదకర స్టంట్స్ అసలే చేయకండి. ఇలాంటి పిచ్చి పనులు చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యుల గురించి ఒకసారి ఆలోచించండి. సోషల్ మీడియా లో పాపులారిటీ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. మీ… pic.twitter.com/ktQ7kWxqbP
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) August 19, 2023
హైదరాబాద్ నగరంలో యువత బైక్పై స్టంట్స్ వేస్తూ రోజు రోజుకి రెచ్చిపోతున్నారు. యువకులు బైక్ వెనక అమ్మాయిలను కూర్చోబె ట్టుకుని బైక్ పై వెళ్తూ వింత వింత విన్యాసాలు చేస్తూ రోడ్డుపై నానా హంగామా సృష్టిస్తున్నారు. అలాగే ఇతర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నారు. ఈ విధంగా బైక్ పై స్టంట్లు వేయడం ఎంతో ప్రమాదకరమని పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్న కూడా యువత వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా భయంకరమైన స్టంట్ లు వేసి ప్రాణాలతో చిలగాటమాడుతున్నారు. అయితే ఓ యువకుడు కూడా తన బైక్ పై ప్రేయసిని కూర్చోబెట్టుకొని స్టంట్ వేస్తున్న సమయంలో ఒక్కసారిగా జారి ఇద్దరు రోడ్డు మీద పడిపోయారు. పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి చెక్కర్లు కొడుతూ ఉండడంతో ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఈ వీడియోను పోస్ట్ చేసి.. బైక్ పై ఇటువంటి ప్రమాదకర మైన స్టంట్ లు వేసి భవిష్యత్తును నాశనం చేసుకోకండి అంటూ ట్వీట్ చేశారు.