లంచం తీసుకునే వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, అవినీతి నిరోధక శాఖ అధికారులు నుండి తప్పించుకోలేరని ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఇందుకు నిన్న రాత్రి జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్లు ను రెడ్ హ్యండెడ్ గా పట్టుకోవడమే నిదర్శనమని అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
నిన్న రాత్రి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు చెందిన జాయింట్ కలెక్టర్ ఎంవీ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి 8 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. 14 గుంటల భూమిని ధరణి పోర్టల్ లొ నిషేధిత భూముల జాబితా నుండి తొలగించుటకు గాను సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. తదుపరి ఆ మొత్తాన్ని జాయింట్ కలెక్టర్ కి అందచేశారు.
ఫిర్యాదుదారుని నుండి నగర శివార్లలో డబ్బు తీసుకోవటం, ఆ పై ఓఆర్ఆర్ దగ్గర జాయింట్ కలెక్టర్ కి అందేలా జాగ్రత్త తీసుకున్నప్పటికీ, ఏసీబీ టీమ్ రాత్రంతా ఎంతో చాకచక్యంగా అప్పటికప్పుడు ప్రణాళికలు మార్పు చేసుకుంటూ ఇద్దరిని ట్రాప్ చేసిందని సీవీ ఆనంద్ వెల్లడించారు.