ఖమ్మం జిల్లా వైరాలో కరోనా కలకలం రేగింది. తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో 27 మందికి విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఇంటికి వెళ్లొచ్చిన ఓ విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. వెంటనే కరోనా పరీక్షలు చేయించగా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. పాఠశాలలోని మిగతా విద్యార్థులకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో 27 మంది విద్యార్థులకు కరోనా సోకడంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన విద్యార్థులకు వారి ఇళ్లకు పంపిచనట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు.
రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 32,621 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 134 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 44 కేసులు వెలుగు చూశాయి. 164 మంది కరోనా బారి నుండి కోలుకోగా, ఒకరు కరోనాతో పోరాడి మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకు 6,74,452 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,980కి పెరిగింది. 3,626 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. నిన్న నిర్వహించిన కరోనా పరీక్షల్లో జనగామ, ములుగు, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో ఎలాంటి కొత్త కరోనా కేసులు నమోదు కాలేదు.