కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తోంది: కవిత

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో పేదల ఇళ్ల కూల్చివేతకు నిరసనగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరాహార దీక్ష రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది

By -  Knakam Karthik
Published on : 11 March 2026 4:40 PM IST

Telangana, Hyderabad, Kalvakuntla Kavitha, Telangana Politics, Khammam Demolitions, Congress Govt, CM Revanth, HungerStrike

కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తోంది: కవిత

హైదరాబాద్: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో పేదల ఇళ్ల కూల్చివేతకు నిరసనగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరాహార దీక్ష రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ, బుల్డోజర్లతో ఒకే రోజు 750 కుటుంబాల ఇళ్లను నేలమట్టం చేసిందని ఆమె మండిపడ్డారు. బాధితుల్లో సగం మందికి పైగా సర్టిఫికెట్లు ఉన్నాయని మంత్రులే అంగీకరిస్తున్నప్పుడు, కూల్చివేతలు ఎందుకు చేపట్టారని ఆమె ప్రశ్నించారు. భూదాన్ భూములను పేదల సంక్షేమం కోసమే కేటాయించారని, ఇప్పుడు భూముల విలువ పెరగడంతో సంపన్నులకు కట్టబెట్టేందుకే ప్రభుత్వం ఈ కుట్రకు పాల్పడిందని ఆమె ఆరోపించారు.

హాల్ టిక్కెట్లు ఉన్న విద్యార్థుల ఇళ్లను కూడా కూల్చివేయడం వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమేనని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మంలో దీక్షకు దిగిన తనను 600 మంది పోలీసులు అడ్డుకుని హైదరాబాద్ తరలించినప్పటికీ, బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో ఆమె తన నిరసనను కొనసాగిస్తున్నారు. కూల్చివేతలు జరిగిన చోటే తిరిగి ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ వచ్చే వరకు తన పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు బాధితులకు అండగా నిలుస్తానని ఆమె ప్రకటించారు.

Next Story