పోలీస్ స్టేష‌న్‌లో మందు పార్టీ.. కానిస్టేబుళ్ల‌పై స‌స్పెన్ష‌న్ వేటు

పోలీస్ స్టేష‌న్‌లో మందు పార్టీ చేసుకున్న ఇద్ద‌రు కానిస్టేబుళ్ల‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

By Medi Samrat
Published on : 7 March 2025 6:15 PM IST

పోలీస్ స్టేష‌న్‌లో మందు పార్టీ.. కానిస్టేబుళ్ల‌పై స‌స్పెన్ష‌న్ వేటు

పోలీస్ స్టేష‌న్‌లో మందు పార్టీ చేసుకున్న ఇద్ద‌రు కానిస్టేబుళ్ల‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా పెద్ద వంగ‌ర పోలీస్ స్టేష‌న్‌లో కానిస్టేబుల్ రాజా రామ్, కానిస్టేబుల్ సుధాకర్‌ బయట వ్యక్తులతో కలిసి పోలీస్‌ స్టేషన్‌లోనే మద్యం సేవించారు. ఈ దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో తీవ్ర విమ‌ర్శ‌లు వచ్చారు. ఈ ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకున్న పోలీస్ శాఖ విచార‌ణ‌లో కానిస్టేబుళ్ల నిర్వాకం నిజ‌మ‌ని తేలింది.

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వ‌డంతో మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఇద్ద‌రు కానిస్టేబుళ్ల‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story