Video : కానిస్టేబుల్‌ను ఢీకొట్టి పారిపోయిన గంజాయి స్మగ్లర్లు

భద్రాచలం గోదావరి నది వద్ద పోలీసు-ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర అనుమానాస్పద గంజాయి స్మగ్లర్లు ఆదివారం నాడు కానిస్టేబుల్‌ను ఢీకొట్టి అక్కడి నుండి పారిపోయారు.

By Medi Samrat  Published on  2 March 2025 5:00 PM IST
Video : కానిస్టేబుల్‌ను ఢీకొట్టి పారిపోయిన గంజాయి స్మగ్లర్లు

భద్రాచలం గోదావరి నది వద్ద పోలీసు-ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర అనుమానాస్పద గంజాయి స్మగ్లర్లు ఆదివారం నాడు కానిస్టేబుల్‌ను ఢీకొట్టి అక్కడి నుండి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాటిని ఆధారంగా చేసుకొని పోలీసులు స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

బ్యాగ్‌తో బైక్‌పై వెళ్తున్న స్మగ్లర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ రామాచారిని బైక్‌తో ఢీకొట్టి పారిపోయారు. కానిస్టేబుల్‌కు ఒక కాలు విరగడంతో స్థానికంగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. స్మగ్లర్ల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. ఫిబ్రవరి 16న చెక్‌పోస్టు వద్ద ఇదే తరహాలో ముగ్గురు స్మగ్లర్లు బైక్ పై వచ్చి బారికేడ్లను ఢీకొట్టి కానిస్టేబుల్‌ను గాయపరిచి పారిపోయారు. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనే చోటు చేసుకుంది.


Next Story