హైదరాబాద్: ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న 36 ఏళ్ల పోలీసు కానిస్టేబుల్ బుధవారం మలక్‌పేట పోలీసు పరిధిలోని అస్మాన్‌ఘా ప్రాంతంలోని తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు జనావత్ కిరణ్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం కుటుంబ సభ్యులు బయటకు వెళ్లినప్పుడు కిరణ్ తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కిరణ్ ఫ్యాన్‌కు వేలాడుతూ ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు కుటుంబ సమస్యలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా ఇటీవల కాలంలో తెలంగాణలో పోలీసుల ఆత్మహత్యలు పెరిగాయి. గడిచిన నెల రోజుల్లో ఐదుగురు పోలీసులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నివసించే హెడ్‌కానిస్టేబుల్ సాయికుమార్ (50) కొల్చారం పోలీస్ స్టేషన్‌లోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన 17వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ బండారి బాలకృష్ణ (34) ఆన్‌లైన్ మోసం కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట మహిళా కానిస్టేబుల్ శ్రుతి డిసెంబర్ 26న చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. డిసెంబర్ 2వ తేదీన ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.