నాచారంలో కానిస్టేబుల్‌ బలవన్మరణం.. ప్రేమ వ్యవహారమే కారణమా.!

Constable commits suicide in Hyderabad. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌ నగర పరిధిలోని నాచారంలోని తన ఇంట్లో ఓ పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

By అంజి  Published on  20 Feb 2022 5:22 AM GMT
నాచారంలో కానిస్టేబుల్‌ బలవన్మరణం.. ప్రేమ వ్యవహారమే కారణమా.!

ఇటీవల కాలంలో కొందరు క్షణికావేశంలో తమ జీవితాలకు ముగింపు పలుకుతున్నారు. చిన్న విషయాలకు సూసైడ్‌ చేసుకుంటున్నారు. తాజాగా ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌ నగర పరిధిలోని నాచారంలోని తన ఇంట్లో ఓ పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న తేజావత్‌ రాజు కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శనివారం విధుల నుంచి ఇంటికి వచ్చిన రాజు మనస్తాపానికి గురై ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు.

కొన్ని వ్యక్తిగత సమస్యలతో డిప్రెషన్‌లోకి జారిపోయి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అయితే కానిస్టేబుల్‌ రాజు ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారమే అని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. కానిస్టేబుల్‌ రాజు మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story
Share it