అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణకు మేం సేవకులం: కవిత

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ హవా కొనసాగింది.

By Srikanth Gundamalla  Published on  3 Dec 2023 4:49 PM IST
congress, won, telangana, assembly elections, brs,

అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణకు సేవకులం: కవిత 

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ హవా కొనసాగింది. మేజిక్‌ ఫిగర్‌ను దాటి లీడింగ్‌లో ఉంది. దాంతో.. కాంగ్రెస్‌ గెలుపు ఖాయం అయ్యింది. అధికార పార్టీ బీఆర్ఎస్‌కు 40 స్థానల్లో మాత్రమే లీడింగ్‌లో ఉంది. తెలంగాణలో ప్రబుత్వం ఏర్పాటు చేయాలంటే 60 అసెంబ్లీ స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. కాబట్టి.. బీఆర్ఎస్‌కు ఏ విధంగా ఈ అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్‌ నాయకులు వరుసగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్‌ గెలుపును స్వాగతిస్తూ ప్రధాన నాయకులు వరుసగా ట్వీట్లు పెడుతున్నారు.

ఇప్పటికే బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ప్రజా తీర్పును స్వాగిస్తున్నామని .. ఫలితాలు కాస్త నిరాశపరిచాయని అన్నారు. అయితే.. మళ్లీ తాము పుంజుకుంటామని అన్నారు. తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణలో అసెంబ్లీ ఫలితాలపై స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా ఒక పోస్టు పెట్టారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా తెలంగాణకు తాము సేవకులం అని చెప్పారు. ఈ విషయం ఎవరూ మర్చిపోవద్దని బీఆర్ఎస్‌ శ్రేణులకు చెప్పారు. కష్టపడి పని చేసిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మన మాతృభూమి కోసంచిత్త శుద్ధితో పనిచేద్దామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్‌ పార్టీ కోసం పని చేసిన సోషల్‌ మీడియా వారియర్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. గెలిచిన ఎమ్మెల్యేలు అందరికీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. అధికారం చేపట్టబోతున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అభినందనలు తెలిపారు.

కాంగ్రెస్‌ గెలుపుపై హరీశ్‌రావు కూడా స్పందించారు. ఈ మేరకు ఆయన కూడా ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. రెండుసార్లు బీఆర్ఎస్‌ను దీవించి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. ఈసారి ప్రజలు కాంగ్రెస్‌ను ఎంచుకున్నారు. ప్రజల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ పాలన కొనసాగించాలని ఆశిస్తున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. అలాగే ఎన్నికల సమరంలో బీఆర్ఎస్‌ గెలుపు కోసం రేయింబవళ్లు కష్టపడి పనిచేసిన పార్టీ శ్రేణులకు, మద్దతు తెలిపిన ప్రజలకు ఈ సందర్భంగా హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story