కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఉల్లిపాయలు కొన్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వస్తున్నారు. 5 డిసెంబర్ 2019న, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉల్లిపాయల ఉత్పత్తి, ధరపై NCP MP సుప్రియా సూలే ప్రశ్నకు ప్రతిస్పందిస్తూ, "నేను ఉల్లిపాయలు, వెల్లుల్లిని ఎక్కువగా తినను. మా కుటుంబంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి గురించి పెద్దగా పట్టించుకోము." అని అన్నారు. అప్పట్లో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.
అప్పటి వ్యాఖ్యలను గుర్తు పెట్టుకుని Maharashtra Congress Sevadal కూరగాయల వ్యాపారి నుంచి ఉల్లిపాయలు కొనుగోలు చేస్తున్న కేంద్ర మంత్రి అంటూ ఫొటోను ట్వీట్ చేశారు.
'నిర్మలా సీతారామన్ ఉల్లిపాయలు తినమని పార్లమెంట్‌లో చెప్పినట్లు ఉన్నారనుకుంటా' అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ ఫోటోను రెండోసారి ట్వీట్ చేసి, "ఉల్లిపాయలు ఆమె పొరుగింట్లో వాళ్ల కోసమా" అని రాశారు.
నిజ నిర్ధారణ :
NewsMeter కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించింది. అక్టోబర్ 9 న ది హిందూలో ఒక కథనాన్ని కనుగొంది, అక్టోబర్ 8 సాయంత్రం నిర్మలా సీతారామన్ చెన్నైలోని మైలాపూర్‌లోని కూరగాయల షాపింగ్‌కు వెళ్లారని తేలింది. తమిళనాడు రాజధాని చెన్నై పర్యటనకు వచ్చిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మైలాపూర్ మార్కెట్‌లో కూరగాయల వ్యాపారులతో ఆమె మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీశారు. ఆమె ఓ దుకాణం వద్ద ఆగి కూరగాయలు కొన్నారు. ఓ బుట్ట తీసుకుని కూరగాయలను ఏరుకున్న నిర్మల వాటిని కొనుగోలు చేశారు. బీన్స్, చిలగడదుంపలు, కాకర కాయలు ఆమె కొనుగోలు చేసారు.
ఆర్థిక మంత్రి కార్యాలయ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఆమె కూరగాయల షాపింగ్‌కు సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు, వీడియోలలో దేనిలోనూ ఆమె ఉల్లిపాయలు కొనడం కనిపించలేదు.
వీడియోలో, 50-సెకన్ల మార్క్ వద్ద ఉన్న ఫ్రేమ్‌ను మేము గమనించాము. ఇది ఉల్లిపాయలను కలిగి ఉన్న వైరల్ ఫోటోను పోలి ఉంటుంది. రెండింటినీ పోల్చి చూస్తే, అందులో ఆమె ఎక్కడా ఉల్లిపాయలు కొనలేదని మేము కనుగొన్నాము. ఫోటో డిజిటల్‌గా మార్చబడింది.. ఉల్లిపాయలను ఎడిట్ చేశారు.
ఆర్థిక మంత్రి కార్యాలయం పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. ది హిందూ కథనం ద్వారా చెన్నైలో కూరగాయల కోసం షాపింగ్ చేస్తున్నప్పుడు మంత్రి ఉల్లిపాయలను కొనుగోలు చేయలేదని స్పష్టంగా తెలుస్తోంది. వైరల్ అవుతున్న చిత్రం మార్ఫింగ్ చేయబడిందని.. ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉందని మేము నిర్ధారించాము.