కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదని బీజేపీ విమర్శలు చేయడం సరికాదని మాజీ పీసీసీ ఛీప్, సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. దేశం కోసం రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ ప్రాణాలర్పించారని.. సోనియా గాంధీకి ప్రధాన మంత్రి పదవి వచ్చినా తీసుకోలేదని అన్నారు. ఏఐసీసీ ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ పోటీలో ఉన్నారు. మల్లికార్జున్ ఖర్గేకు గ్రౌండ్ రియాల్టీ తెలుసు.. శశిథరూర్ కు ఏమీ తెలియదు. మల్లికార్జున్ ఖర్గే డిబేట్స్ కు రావాలని శశిథరూర్ అనడం సరికాదని అన్నారు. శశిథరూర్ చెబుతున్నది బ్రిటన్ సంస్కృతి. బ్రిటీష్ సంస్కృతి ఇక్కడకి తీసుకురావాలని శశిథరూర్ చూస్తున్నాడా అని ప్రశ్నించారు. శశిథరూర్ మాకు చెప్పి నామినేషన్ వేయలేదని అన్నారు. రాహుల్ తెలంగాణలో పాదయాత్రతో మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి ఎలాంటి ఇబ్బందీ లేదని వీహెచ్ అన్నారు.