కోర్టు తీర్పు.. ఎన్నికల్లో గెలిచిన దానికంటే చాలా సంతోషానిచ్చింది : వీహెచ్

Congress Senior Leader V Hanumantha Rao. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో అట్టడుగు బలహీన వర్గాలు పైకి వచ్చాయని.. ఆయన

By Medi Samrat  Published on  13 Jan 2023 4:36 PM IST
కోర్టు తీర్పు.. ఎన్నికల్లో గెలిచిన దానికంటే చాలా సంతోషానిచ్చింది : వీహెచ్

బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో అట్టడుగు బలహీన వర్గాలు పైకి వచ్చాయని.. ఆయన రాజ్యాంగం పుణ్యమా చట్ట సభలు నడుస్తున్నాయని పీసీసీ మాజీ చీఫ్ వీ హ‌నుమంత‌రావు అన్నారు. గాంధీ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. పంజాగుట్ట చౌరస్తాలో 2019 ఏప్రిల్ 12న అర్ధరాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని కూలగొట్టారని.. అప్పుడు జాయింట్ కలెక్టర్ ను సంప్రదించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. జులై 18న అమలాపురంలో మరొక విగ్రహాన్ని తయారు చేయించి తెప్పించాను.. తెల్లారేసరికి ఆ విగ్రహాన్ని పోలీసులు ఎత్తుకెళ్లారు. లాకప్ లో పెట్టారు.. దీనిపై ఎన్నోసార్లు సమావేశాలు పెట్టాను.. గట్టిగా మాట్లాడగా.. కొట్లాడగా.. ఆ విగ్రహాన్ని హనుమంతురావుకు ఇవ్వాలని ఇప్పుడు కోర్ట్ ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు.

మనం అంతా కలిసి కొత్త సీఎస్‌ను కలిసి అంబేడ్కర్ విగ్రహం ఎక్కడైతే తొలగించారో.. అక్కడే పెట్టుకునేలా అనుమతి ఇవ్వాలని కోరుదామ‌ని హ‌నుమంత‌రావు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలిచిన దానికంటే.. నాకు ఈ తీర్పు చాలా సంతోషంగా ఉందని అన్నారు. పోలీసులు ఎత్తుకెళ్లిన సమయంలో విగ్రహం ఎలా ఉందో.. అలాగే అప్పగించాలని కోర్టు ఆదేశించిందని.. అంబేద్కర్ ను కాపాడుకోవ‌డం కాంగ్రెస్ పార్టీ తరఫున విజయంగా అభివ‌ర్ణించారు. లాయర్లు శ్రీనివాస్ శర్మ, సునీల్ ల చొరవతో కోర్టులో అంబేద్కర్ విగ్రహం కోసం పోరాడిన‌ట్లు వీహెచ్ తెలిపారు.


Next Story