పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారంలో క్లారిటీ ఇచ్చిన సీనియ‌ర్‌ కాంగ్రెస్ నేత

Congress Senior leader Marri Shashidhar Reddy. బీజేపీలో చేరేందుకు తాను న్యూఢిల్లీకి వచ్చినట్టుగా సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని

By Medi Samrat  Published on  16 Nov 2022 2:45 PM GMT
పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారంలో క్లారిటీ ఇచ్చిన సీనియ‌ర్‌ కాంగ్రెస్ నేత

బీజేపీలో చేరేందుకు తాను న్యూఢిల్లీకి వచ్చినట్టుగా సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. బుధవారం నాడు న్యూఢిల్లీలో మర్రి శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను ఢిల్లీకి రావడం కొత్తేం కాదన్నారు. తాను ఇంకా రాజకీయాల్లోనే ఉన్నానని.. తాను ఢిల్లీకి వచ్చిన విమానంలో అన్ని పార్టీల నేతలున్నారన్నారు. ఢిల్లీలో వ్యక్తిగత పనుల కోసం వచ్చినట్టుగా శశిధర్ రెడ్డి చెప్పారు. తాను బీజేపీలో చేరుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. ప్రతి నెల తాను ఢిల్లీకి వస్తానని మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు మాసంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్లపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని తప్పుబట్టడంతో ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం సాగింది. తాజాగా ఆయన ఢిల్లీ చేరడంతో బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే ప్రచారం సాగింది. కానీ వాటిలో ఎలాంటి నిజం లేదని మర్రి శశిధర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.


Next Story