కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మేనిఫెస్టోను ఎవ్వరు నమ్మరని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్ లు, గ్యారంటీలు ముందు పెట్టుకొని సవరణలు చేసి దాన్నే మేనిఫెస్టో అంటున్నారని విమర్శించారు. ఇప్పటికే కేసీఆర్ చేతిలో అన్ని వర్గాలు మోసపోయాయన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం జరిగాయని అన్నారు. కాంగ్రెస్ గ్యారంటీల పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగింది. దాంతో కేసీఆర్ వాటినే బట్టి కొట్టి అవ్వే పథకాలు అమలు చేస్తామని అంటున్నారని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది. కాంగ్రెస్ ఈ సారి గెలిచి సోనియాగాంధీకి బహుమతి గా ఇస్తామని తెలిపారు.