మంత్రి కేటీఆర్‌కు సంస్కారం లేదు : జానారెడ్డి
మంత్రి కేటీఆర్‌కు సంస్కారం లేదని.. రాహుల్ గాంధీపై సంస్కారం లేకుండా మాట్లాడారని మాజీ మంత్రి జానారెడ్డి మండిపడ్డారు.
By Medi Samrat Published on 22 Oct 2023 9:15 AM GMTమంత్రి కేటీఆర్‌కు సంస్కారం లేదని.. రాహుల్ గాంధీపై సంస్కారం లేకుండా మాట్లాడారని మాజీ మంత్రి జానారెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంస్కారం లేని వాల్ల గురించి తాను ఎక్కువ మాట్లాడనన్నారు. నువ్వు చేస్తానన్నవి అమలు చేశావా.. అని కేటీఆర్‌ను ప్రశ్నించారు.
దళితులకు మూడెకరాల భూమి ఇచ్చావా.?.. యూపీఏ దిగిపోయే నాటికి కరెంట్ ఇచ్చింది ఎవరు.?.. 60 ఏండ్లు ఏ పదవి లేకుండా స్వాతంత్ర్యం కోసం కొట్లాడింది కాంగ్రెస్ కాదా.?.. విశాల దృక్పధం తో పని చేసింది కాంగ్రెస్ కాదా.? సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వలేదా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇప్పటి వరకు సాధించిన ప్రగతి ఎవరు సాధించారు.. మీరా అని మండిపడ్డారు. ఉపాధి హామీ ఇచ్చింది.. ఆహార భద్రత.. అటవీ హక్కులు ఇచ్చింది కాంగ్రెస్ కాదా..? అటవీ హక్కులు ఇవ్వకపోతే పోడు భూములు వచ్చేవా..? అని నిలదీశారు. 2004 లోనే కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇచ్చిందన్నారు. పెడింగ్ బిల్లులు రద్దు చేసింది కూడా మేమేనన్నారు. ఇప్పుడు కొనసాగుతుంది.. మేము ఇచ్చిన కరెంట్ నే కదా..? అప్పట్లో డబ్బు పెట్టి కొనడానికి కూడా లేని పరిస్థితీ.. మేము ఇచ్చిన 7, 8 గంటలే కదా మీరు ఇస్తున్నది.. కరెంట్ ఉత్పత్తికి కృషి చేసింది కాంగ్రెస్.. వాటిని కొనసాగిస్తుంది నువ్వు అని కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో తలసరి ఆదాయం పెరిగింది అంటున్నారు. 2004 నుండి 14 వరకు 6.5 శాతం పెరిగింది. బీఆర్ఎస్ 9 ఏండ్ల తలసరి ఆదాయం కంటే మేము చేసింది ఎక్కువ అన్నారు. మోదీ అప్పులు చేశారు అని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. మీరు రూ.5 లక్షల 50 వేల కోట్ల అప్పు చేశారని దుయ్యబట్టారు. మేడిగడ్డ పై పూర్తిగా అధ్యయనం చేస్తాం.. ఆ తర్వాత మాట్లాడతానన్నారు.
బీఆర్ఎస్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు. బీఆర్ఎస్‌ని సహించే పరిస్థితిలో జనం లేరన్నారు. కాంగ్రెస్ ని నిలబెట్టడానికి ప్రజలు సిద్ధం అయ్యారని.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం కాంగ్రెస్ కూడా సిద్ధంగా ఉందన్నారు.