కాంగ్రెస్ జనహిత పాదయాత్ర రెండో విడత షెడ్యూల్ విడుదల

జనహిత పాదయాత్ర రెండో విడత షెడ్యూల్‌ను టీపీసీసీ విడుదల చేసింది.

By Knakam Karthik
Published on : 12 Aug 2025 1:59 PM IST

Telangana, Congress,  Janahita Padayatra, second phase, Tpcc

కాంగ్రెస్ జనహిత పాదయాత్ర రెండో విడత షెడ్యూల్ విడుదల

హైదరాబాద్: జనహిత పాదయాత్ర రెండో విడత షెడ్యూల్‌ను టీపీసీసీ విడుదల చేసింది. ఈ నెల 24వ తేదీ నుంచి రెండో విడత పాదయాత్ర ప్రారంభం అవుతుందని ఓ ప్రకటనలో తెలిపింది. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలో ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటలకు జనహిత పాదయాత్ర ప్రారంభం అవుతుందని పేర్కొంది. ఉదయం 25వ తేదీ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శ్రమదానం నిర్వహించనున్నట్లు టీపీసీసీ తెలిపింది. ఉదయం 10.30 గంటల నుంచి కరీంనగర్ జిల్లా కార్యకర్తల సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు వర్ధన్నపేట నియోజకవర్గంలో జనహిత పాదయాత్ర జరగనుంది. 26వ తేదీ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శ్రమదానం. 10.30 గంటలకు వరంగల్ జిల్లా కార్యకర్తల సమ్మేళనం. 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం..నిర్వహించనున్నట్లు తెలిపింది.

Next Story