ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ

Congress MP Venkat Reddy writes to KCR. తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ రాశారు. ఇప్పటికే వడ్లు కొనుగోలులో రైతులు

By Medi Samrat  Published on  29 March 2022 6:16 PM IST
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ

తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ రాశారు. ఇప్పటికే వడ్లు కొనుగోలులో రైతులు గందరగోళంలో ఉన్నారని.. ఇప్పుడు చేతికొచ్చిన పంటకు మీరు నీరు అందించకుండా కరెంట్ కోతలు విధించటం సరికాదని అన్నారు. పట్టణ ప్రాంతాలకు 24 గంటలు కరెంట్ ఇస్తూ.. రైతులకు కోతలు విధించటం సబబు కాదని అన్నారు. అవసరం అనుకుంటే పట్టణ ప్రాంతంలో 2 గంటలు కోత విధించి.. రైతాంగానికి మేలు చేయండని సూచించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రోజు వారీగా 35 మిలియన్ యూనిట్లు రికార్డ్ కాగా.. 5 మిలియన్ యూనిట్లు కోత విధించారని అన్నారు. రైతులను 24 గంటల కరెంట్ కి అలవాటు చేసి ఇలా కోతలు విధించడం ఏంటి..? అని ప్ర‌శ్నించారు.

మరో వైపు ఎరువుల ధరల రేట్లు పెంచటం రైతులకు భారంగా మారుతుందని అన్నారు. 266 న్న యూరియాపై 50 రూపాయలు పెంచారని.. 28-28-28 రూ.1474 ఉండగా.. ఇప్పుడు రూ. 1900 చేసి ఏకంగా.. 425 రూపాయలు పెంచారని అన్నారు. 17-17-17 కానీ 14 - 13- 14 కానీ వీటిపై కూడా 425 రూపాయలు పెంచారని అన్నారు. పోటాష్ ధర 885 ఉండగా.. 1700 చేసి ఒకేసారి 815 రూపాయలు పెంచారని తెలిపారు. ఇలా ఓ వైపు ఎరువుల ధరలు పెంచుతూ.. కరెంట్ కోతలు విధిస్తు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. నేలతల్లిని నమ్ముకుని బ్రతుకుతున్న రైతన్నలను ఇలా వేధించటం సరికాదని అన్నారు. రైతన్నలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిపై ఇలా కక్ష సాధించడం న్యాయం కాదని లేఖ‌లో పేర్కొన్నారు.










Next Story