ఆర్‌. కృష్ణయ్య రాజీనామా త‌ర్వాత‌ ట్విస్ట్.. రంగంలోకి దిగిన కాంగ్రెస్ ఎంపీ

నిన్న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన‌ ఆర్. కృష్ణయ్య నివాసానికి బుధ‌వారం ఉద‌యం కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, నాగ‌ర్ క‌ర్నూల్ ఎంపీ మల్లు రవి వెళ్లారు

By Medi Samrat  Published on  25 Sep 2024 4:51 AM GMT
ఆర్‌. కృష్ణయ్య రాజీనామా త‌ర్వాత‌ ట్విస్ట్.. రంగంలోకి దిగిన కాంగ్రెస్ ఎంపీ

నిన్న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన‌ ఆర్. కృష్ణయ్య నివాసానికి బుధ‌వారం ఉద‌యం కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, నాగ‌ర్ క‌ర్నూల్ ఎంపీ మల్లు రవి వెళ్లారు. ఆంద్రప్రదేశ్ వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆర్. కృష్ణయ్య నిన్న తన ఎంపీ పదవికి రాజీనామా చేయ‌డంతో.. ఆయ‌న రాజీనామాను ఛైర్మ‌న్ ఆమోదించారు. కాగా.. కృష్ణయ్య బీజేపీలో చేరుతార‌నే ఊహాగానాలు జోరుగా ప్ర‌చారంలో ఉన్న క్ర‌మంలో ఆయనను కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించేందుకు మల్లు రవి భేటి అయినట్టు సమాచారం.

ఆర్.కృష్ణయ్య బీసీ ఉద్యమ నాయకుడు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు. ఆయన 2014లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆయన ప్రస్తుతం రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసి.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు.

ఆర్.కృష్ణయ్య తన రాజీనామా పై స్పందిస్తూ.. సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో బీసీ ఉద్యమానికి కొన్ని అడ్డంకులున్నాయని.. బీసీ ఉద్యమం బలోపేతం చేయడానికి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశానని తెలిపారు. తన పదవికి మరో నాలుగేళ్ల సమయం ఉన్నా.. బీసీ ఉద్యమం కోసం త్యాగం చేశానని చెప్పుకొచ్చారు. తాను రాజకీయాలకు అతీతంగా ఉంటానని.. బీసీ డిమాండ్లకు ఏ పార్టీ మద్దతు ఇస్తే వారి మద్దతు తీసుకుంటామని ఆర్. కృష్ణయ్య ప్రకటించారు.

Next Story