మూసీని అభివృద్ధి చేయమ‌ని సీఎంకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి

హరీష్ రావు రాహుల్ గాంధీకి లెటర్ రాశాడని.. ఆయ‌న‌ లెటర్ రాసింది మూసి బాధితుల కోసం కాదు.. రేవంత్ రెడ్డికి వస్తున్న ఆదరణ తట్టుకోలేక రాహుల్ గాంధీకి లేక రాసిండని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు.

By Medi Samrat  Published on  1 Oct 2024 2:45 PM GMT
మూసీని అభివృద్ధి చేయమ‌ని సీఎంకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి

హరీష్ రావు రాహుల్ గాంధీకి లెటర్ రాశాడని.. ఆయ‌న‌ లెటర్ రాసింది మూసి బాధితుల కోసం కాదు.. రేవంత్ రెడ్డికి వస్తున్న ఆదరణ తట్టుకోలేక రాహుల్ గాంధీకి లేక రాసిండని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మాట్లాడుతూ.. మూసీని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయన్నారు. బలవంతంగా పేద ప్రజల పొట్టగొట్టాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. రూ.500 లకే గ్యాస్, 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తున్న పేదల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.

మూసీపై డీపీఆర్‌ ఇంకా కాలేదు, పనులు స్టార్ట్ కాలేదు, డబ్బులు డ్రా చేయలేదు.. అవినీతి జరిగిందని కేటీఆర్ అంటున్నాడు.. ప్రతి పక్ష నాయకుడిగా హైడ్రాపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. కేసీఆర్ కు క్యాబినెట్ ర్యాంక్ ఎందుకు ఇచ్చింది.. పామ్ హౌస్ లో పడుకోవడానికా అని ప్ర‌శ్నించారు. తప్పుడు ప్రచారం చేస్తే కాంగ్రెస్ కు లాభమే కానీ నష్టం లేదన్నారు. తప్పుడు ప్రచారం వలన బీఆర్ఎస్ పార్టీకే నష్టం అన్నారు.

మూసీ నది వలన హైదరాబాద్ దుర్గంధంగా మారిందన్నారు. కేసీఆర్ మూసీపై అప్పుడే కమిటీ వేశారు.. ఎందుకు ప్రక్షాళన జరగలేదో ప్రజలకు తెలుసు అన్నారు. డబ్బులు లేకపోయినా సీఎం రేవంత్ రెడ్డి మూసీ, హైడ్రా ను తెచ్చి హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఆరు గ్యారంటీల అమలు జరగట్లేదని కేటీఆర్, బీఆర్ఎస్ గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ మూసీ అభివృద్ధి కోసం సలహా సూచనపై బ్లూ ప్రింట్ ఇవ్వండన్నారు.

కేసీఆర్ సుందరికరణ పేరుతో సచివాలయాన్ని కులగొట్టారు. అది ప్రజలకు ఉపయోగపడ‌దు. కానీ మూసీ ఫ్యూరిఫికేషన్ ప్రజలకు ఉపయోగపడుతుంద‌న్నారు. హైడ్రాను హైకోర్టు ఆపలేదని.. కేవలం సూచన చేసిందన్నారు. కేటీఆర్ పై జరిగిన భౌతిక దాడిని ఖండిస్తున్నామ‌న్నారు.

Next Story