ఆ ఇద్ద‌రికి ఎప్పుడు కోపం వ‌స్తే అప్పుడు ఎన్డీఏ ప్ర‌భుత్వం కూలిపోతుంది : ఎంపీ మల్లు రవి

భయపడకండి నేను మీ ముందు ఉన్నాను అంటూ దేవుడి రూపంలో కిందికి వచ్చిన మనిషి రాహుల్ గాంధీ అని ఎంపీ మల్లు రవి కొనియాడారు.

By Medi Samrat  Published on  19 Jun 2024 2:57 PM IST
ఆ ఇద్ద‌రికి ఎప్పుడు కోపం వ‌స్తే అప్పుడు ఎన్డీఏ ప్ర‌భుత్వం కూలిపోతుంది : ఎంపీ మల్లు రవి

భయపడకండి నేను మీ ముందు ఉన్నాను అంటూ దేవుడి రూపంలో కిందికి వచ్చిన మనిషి రాహుల్ గాంధీ అని ఎంపీ మల్లు రవి కొనియాడారు. గాంధీ భవన్ లో జ‌రిగిన‌ రాహుల్ జ‌న్మ‌దిన వేడుక‌ల్లో పాల్గొన్న అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. పేద ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని అన్నారు. మోదీ పాలనలో జనాలు ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు.

మోదీ 400 సీట్లు వస్తాయని చెప్పార‌ని.. కేవలం 240సీట్లు మాత్రమే వచ్చాయన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు గెలిచిన చోట ఒక్క చోట బీఆర్ఎస్‌కు డిపాజిట్ రాలేదన్నారు. మెదక్ లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని హరీష్ చెప్పాడు. అందుకే అక్కడ బీజేపీ గెలిచిందన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంలో 40 వేల ఓటు కూడా పడవు.. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి ఓటు వేయమని చెప్పడంతో బీజేపీకి నాగర్ కర్నూల్ లో ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. నైతికంగా మేము 14 సీట్లు గెలిచాము.. బీఆర్ఎస్‌.. బీజేపీ తో కలిసి ఉండకపోతే మాకు 14 సీట్లు వచ్చేవన్నారు.

రేవంత్ రెడ్డి 20 గంటలు పని చేస్తున్నారని కితాబిచ్చారు. బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని రాహుల్ గాంధీ చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదన్నారని ఎంపీ మ‌ల్లు ర‌వి అన్నారు. నితీష్ కుమార్, చంద్రబాబు దయాదాక్షిణ్యాల‌ మీద ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది. వాళ్లకు ఎప్పుడు కోపం వస్తే అప్పుడు ఈ ప్రభుత్వం కూలిపోతుందన్నారు.

Next Story