హైదరాబాద్‌లో తిరగనియ్యం.. కేటీఆర్‌కు ఎంపీ అనీల్ కుమార్ యాదవ్ హెచ్చ‌రిక‌

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదని.. మేనేజ్ మెంట్ కోటాలో వొచ్చింది కేటీఆర్ అని రాజ్యసభ సభ్యుడు అనీల్ కుమార్ యాదవ్ అన్నారు

By Medi Samrat  Published on  11 March 2024 8:30 AM GMT
హైదరాబాద్‌లో తిరగనియ్యం.. కేటీఆర్‌కు ఎంపీ అనీల్ కుమార్ యాదవ్ హెచ్చ‌రిక‌

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదని.. మేనేజ్ మెంట్ కోటాలో వొచ్చింది కేటీఆర్ అని రాజ్యసభ సభ్యుడు అనీల్ కుమార్ యాదవ్ అన్నారు. గాంధీ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. 10ఏండ్లలో కేటీఆర్ ఏమి చేసిండో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. కేటీఆర్ ఎవరి బూట్లు నాకింది అందరికీ తెలుసన్నారు. పిచ్చి మాటలు మాట్లాడితే ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేరడం ఖాయమ‌న్నారు. రేవంత్ రెడ్డి ప్రజా నాయకుడు, ఆయన సేవ చేయడానికి ముఖ్యమంత్రి అయ్యిండని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి కేటీఆర్‌ అనవసరంగా మాట్లాడితే హైదరాబాద్‌లో తిరగనియ్యమ‌ని హెచ్చ‌రించారు.

మ‌ల్లు ర‌వి

రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో పాలన అత్యంత ప్రజాస్వామికంగా జరుగుతుందని సీనియ‌ర్ నేత మ‌ల్లు ర‌వి తెలిపారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీచర్ల సంఘాలు, ఉద్యోగ సంఘాలతో సమావేశం కావడం వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం, సంఘాల ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇవ్వడం హర్షించదగ్గ విషయమ‌న్నారు. ప్రజాస్వామ్య వాదులు, మేధావులు ఈ విషయాలను స్వాగతించాలన్నారు. కేటీఆర్ నిన్న రేవంత్ రెడ్డి పట్ల మాట్లాడిన తీరు జుగుప్సాకరంగా ఉందని ఖండించారు. ఆంధ్ర వాళ్ళ బూట్లు నాకారని, పార్టీలు మారిన రేవంత్ అంటూ కేటీఆర్ మాట్లాడ్డం ఆయన తన తండ్రి కేసీఆర్ ను తిట్టినట్టుగా ఉందన్నారు. కేసీఆర్ ఎక్కడ రాజకీయాలు మొదలు పెట్టారు, ఎక్కడ మంత్రి అయ్యారు, ఎక్కడ డిప్యూటీ స్పీకర్ అయ్యారు, అని కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కేటీఆర్ ఆయన స్థాయి, ఆయన సోయి మరచిపోయి మాట్లాడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల మెప్పు పొంది ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. తెలంగాణ ప్రజలలో అత్యంత ఆదరణ ఉన్న నాయకుడిని కేటిఆర్ ఇలా మాట్లాడ్డం సిగ్గుమాలిన చర్య అన్నారు. కేటిఆర్ ఇలాగే మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఉన్న ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి బయటకు పంపుతారన్నారు.

Next Story