కేసీఆర్‌ సభకు రానప్పుడు.. ప్రతిపక్ష నేత హోదా ఎందుకు?: రాజగోపాల్‌రెడ్డి

కేసీఆర్ గురించి సంచలన కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.

By Srikanth Gundamalla  Published on  29 July 2024 1:30 PM IST
congress, mla rajagopal reddy, comments,  brs, kcr ,

కేసీఆర్‌ సభకు రానప్పుడు.. ప్రతిపక్ష నేత హోదా ఎందుకు?: రాజగోపాల్‌రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం అసెంబ్లీలో మాట్లాడిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తమ హయాంలో విద్యత్ రంగాన్ని అప్పుల్లోకి నెట్టేసిందని ఆరోపించారు. శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా కేసీఆర్ గురించి సంచలన కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్పుల నుంచి విద్యుత్ రంగాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోందని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారనీ.. ఆ వాఖ్యలు సరికాదని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పులను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. బీఆర్ఎస్ సర్కార్‌ విద్యుత్‌ రంగాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు అదనపు విద్యుత్‌ను యూపీఏ ప్రభత్వం కేటాయించిందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. జనాభా ప్రాతిపదికన కాకుండా రాష్ట్ర అవసరాల మేరకు విద్యుత్‌ కేటాయించారని గుర్తు చేశారు. కేసీఆర్‌ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఆయన అసెంబ్లీకి రాకపోతే ప్రతిపక్ష నేత హోదా ఎందుకు అని ప్రశ్నించారు. ఆయన హోదాను మరెవరైనా తీసుకోవచ్చు కదా అంటూ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విమర్శలు చేశారు.

అయితే.. విద్యుత్‌ అవకతవకలపై కమిషన్‌ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ లాభదాయకం కాదని 2018లోనే చెప్పానని గుర్తు చేశారు. ఈ ప్లాంట్‌ పూర్తయ్యేందుకు అదనంగా రూ.11 వేల కోట్లు ఖర్చు పెట్టాలన్నారు. అయితే.. డబ్బులు పోయినా కూడా యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ పూర్తికాలేదని తెఇపారు. రామగుండంలో పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. మరి రామగుండంలో కాకుండా.. పవర్ ప్లాంట్‌ను యాదాద్రిలో ఎందుకు నిర్మించారో చెప్పాలని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి బీఆర్ఎస్‌ను ప్రశ్నించారు.

Next Story