రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చే మొగోడివా.? కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే పైర్‌

సెప్టెంబర్ 17న తెలంగాణకు విముక్తి కలిగిన రోజు.. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి తెలంగాణకు విముక్తి కల్పించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల శ్యాముల్ అన్నారు

By Medi Samrat  Published on  16 Sept 2024 3:44 PM IST
రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చే మొగోడివా.? కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే పైర్‌

సెప్టెంబర్ 17న తెలంగాణకు విముక్తి కలిగిన రోజు.. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి తెలంగాణకు విముక్తి కల్పించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల శ్యాముల్ అన్నారు. హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో ఇది జరిగింది. సర్దార్ పటేల్‌తో బీజేపీకి ఏం సంబంధం అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ మనిషిని.. బీజేపీ మా వారసుడు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. సర్దార్ పటేల్ నిఖార్సైన కాంగ్రెస్ బిడ్డ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ లేదు.. తెలంగాణలో బీజేపీ పాచికలు పారవని.. మొన్నటి ఎన్నికల్లో BRS వల్ల నాలుగు సీట్లు వచ్చాయన్నారు. బీజేపీ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు ఏమైన లబ్ది కలిగిందా అని ప్ర‌శ్నించారు.

కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కోవర్టుగా పని చేశారు. కౌశిక్ లాంటి వ్యక్తిని వెనకేసుకొస్తే.. హరీష్ రావు, కేటీఆర్ పరువు పోతుందన్నారు. డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత కౌశిక్ రెడ్డికి లేదన్నారు. రుణమాఫీ ఏక కాలంలో పూర్తి చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిద‌ని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అందిస్తుందన్నారు. కౌశిక్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చే మొగోడివా..? అంటూ ఫైర‌య్యారు.

రాష్ట్రం లో BRS పని అయిపోందని.. BRSలో పార్టీ అధ్యక్ష పదివిని వేరొకరికి ఇచ్చే దైర్యం ఉందా అని స‌వాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్‌గా మహేష్ గౌడ్ కు అవ‌కాశం ఇచ్చింద‌న్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మంత్రి వర్గ ఉప సంఘం వేయడం శుభ పరిణామం. త్వరలో వర్గీకరణ అమలు జరుగుతుందన్నారు.

Next Story