డీజీపీని క‌ల‌వ‌నున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

Congress Leaders To Meet DGP Mahender Reddy. తెలంగాణ రాష్ట్ర‌ డీజీపీ మహేందర్ రెడ్డితో కాంగ్రెస్ శాసనసభ పక్షం స‌మావేశం కానుంది.

By Medi Samrat
Published on : 28 July 2021 1:16 PM IST

డీజీపీని క‌ల‌వ‌నున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

తెలంగాణ రాష్ట్ర‌ డీజీపీ మహేందర్ రెడ్డితో కాంగ్రెస్ శాసనసభ పక్షం స‌మావేశం కానుంది. బుధ‌వారం సాయంత్రం 5 గంటలకు డీజీపీ కార్యాలయానికి వెళ్లి క‌ల‌వ‌నున్నారు కాంగ్రెస్ నేత‌లు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నేతృత్వంలో ఎమ్మెల్యే లు జగ్గారెడ్డి, సీతక్క తదితరులు డీజీపీ తో భేటీ కానున్నారు. ఇటీవల ఇందిరా పార్కు వద్ద ఫోన్ టాపింగ్ లను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ చేపట్టిన ధర్నాలో ఎనంఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షులు బలమూరి వెంకట్ పై పోలీసులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో వెంకట్ ఛాతీ ఎముకలు విరిగాయని పేర్కొన్నారు. ఈ విషయంలో పోలీసుల వైఖరిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ అంశంలో పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ రోజు డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించనున్నారు.


Next Story